Endendu Vethikina Lyrics in Telugu
అభయమిచ్చేటి ఆ మూర్తి నీదనుచు..
రాతి రూపాన నే నిన్ను గంటి ..
నీ కృప తో నువు బ్రోవ నన్నొక్కసారి…
ఆ రాయిలోనే రాముణ్ణి గంటి !!
ఆ గర్భగుడిలోన నీవున్నవనిరి..
ప్రతి జీవి పుట్టుక నీ మర్మమనిరి..
ఆ తల్లి గర్భమున నువ్వొసగు ఊపిరి..
ఎవరైన కనగలర లోపలికి చేరి !!
ఎందెందు వెతికినా నువు కానరావు.. మాయందు నిను వెతుక మాకేల రాదు!!
భావ కల్పితమే భక్తి యనుకొంటి..
వేదాలు,శాస్త్రాలు నిను తెలుప చదివి…
నా మదిని బంధించ ఆ అడవి కేగి..
ఉఛ్వాస నిచ్వాసముల నిన్ను గంటి ..
ఆకాశమంతటి అతి సూక్ష్మ సత్వము..
ఆ సంద్రమంటి లోతైన తత్వము..
పరమాత్మ లేడు పరలోకమందు..
పరమాత్ముడుండు ప్రతి ప్రాణి యందు !!
ఎందెందు వెతికినా నువు కానరావు.. మాయందు నిను వెతుక మాకేల రాదు!!
ఘనమందు ఘనము,సూక్ష్మమున సూక్షము…
ప్రతిజీవి కోరే ఆ పుణ్య మోక్షము…
నాలోన నీవు, నీలోనే నేను ..
నువు లేక నేను యెటులుండగలను!!
నాస్తికపువాదులు నువు లేవు అనిరి…
రాక్షస అధములు నువ్వెవరనిరి ..
నువ్వు కాక లేగకు పొదుగెవరు చూపిరి..
ఆ జంతుజాలముల కాన్పెవరు చేసిరి!!
ఎందెందు వెతికినా నువు కానరావు.. మాయందు నిను వెతుక మాకేల రాదు!!
కర్మలను బట్టి కరుణింతునంటివి..
ధర్మమును బట్టి దయ చూతునంటివి…
పాపమనగా లేదు పరదేశమందు…
మేము చేయు పనుల తగిలుందనంటివి !!
మా స్వార్ధములు మమ్మల్ని విడదీయ..
వైష్ణవము, శైవమని నిన్ను చీల్చి చూసి …
ఆ కులము ఈ మతము అనుకుంట బోయి ..
కాకులకు సరి కాని కపటులము అయితిమి !!
ఎందెందు వెతికినా నువు కానరావు.. మాయందు నిను వెతుక మాకేల రాదు!!
Endendu Vethikina Lyrics in English
Abhayamiccheti aa moorthi needanuchu…
Raathi roopaana ne ninnu ganti…
Nee krupa tho nuvvu brova nannokka saari…
Aa raayilone Raamunni ganti!!
Aa garbhagudilona neevunnavaniri…
Prati jeevi puttuka nee marmamaniri…
Aa talli garbhamuna nuvvosagu oopiri…
Evaraina kanagalara lopalaki cheri!!
Endendu vetikinaa nuvvu kaanaraavu…
Maayandu ninnu vetuka maakela raadu!!
Bhaava kalpitame bhakti yanukonti…
Vedaalu, shaastraalu ninnu telupa chadivi…
Naa madini bandhinca aa adavi kegi…
Uchwaasa nichwaasamula ninnu ganti…
Aakaashamantati ati sookshma satvamu…
Aa sandramanti loathaina tatvamu…
Paramaatma ledu paralokamandu…
Paramaatmuduundu prati praani yandu!!
Endendu vetikinaa nuvvu kaanaraavu…
Maayandu ninnu vetuka maakela raadu!!
Ghanamandu ghanamu, sookshmamuna sookshmamu…
Pratijeevi kore aa punya mokshamu…
Naalona neevu, neelone nenu…
Nuvvu leka nenu yetulundagalanu!!
Naastikapu vaadulu nuvvu levu aniri…
Raakshasa adhamulu nuvvyevaraniri…
Nuvvu kaaka legaku podugevaru choopiri…
Aa janthujaalamula kaanpevaru chesiri!!
Endendu vetikinaa nuvvu kaanaraavu…
Maayandu ninnu vetuka maakela raadu!!
Karmalanu batti karuninthunantivi…
Dharmamunu batti daya choothunantivi…
Paapamanagaa ledu paradesamandu…
Memu cheyu panula tagilundananantivi!!
Maa swarthamulu mammalni vidadiya…
Vaishnavamu, Shaivamani ninnu cheelchi choosi…
Aa kulamu ee mathamu anukunta boyi…
Kaakulaku sari kaani kapatalamu ayitimi!!
Endendu vetikinaa nuvvu kaanaraavu…
Maayandu ninnu vetuka maakela raadu
Written by: Laxmikanth Nagulapalli
Endendu Vethikina Song Description
"Endendu Vethikina" is a touching Telugu devotional song that feels like a heartfelt conversation with God. The lyrics, written by Laxmikanth Nagulapalli, speak of devotion, the search for the Divine, and the belief that God is present everywhere. Pruthviraj Manikonda’s emotional singing, combined with Vijay Krishna’s soothing music, makes this song a deeply spiritual experience. The song’s message is clear: no matter how much we search, God is always within us. With its meaningful words and calming melody, "Endendu Vethikina" is more than just music—it’s a prayer in the form of a song.