నేను నా పల్లెటూరు Nenu Na Palleturu Lyrics in Telugu – M.L.R. Karthikeyan, Sumanth Prabhas, Nidhi Pradeep | Godari Gattupaina

నేను నా పల్లెటూరు పాట లిరిక్స్ | Godari Gattupaina సినిమా నుండి. M.L.R. Karthikeyan గారి స్వరంలో ఊరి ప్రేమను చాటే ఈ సోల్ఫుల్ సాంగ్. నీ స్వర్గమే నీ ఊరు అని చెప్పే ఈ పాట పూర్తి లిరిక్స్ ఇక్కడ చదవండి.

Nenu Na Palleturu Song Poster from Godari Gattupaina

Nenu Na Palleturu Lyrics in Telugu – Full Song Lyrics (నేను నా పల్లెటూరు)

నేను నా పల్లెటూరు 
ఇంతే నా స్వర్గం 
అందం ఆనందమే 
అనునిత్యం నా మార్గం 

నేను నా పల్లెటూరు 
ఇంతే నా స్వర్గం 
అందం ఆనందమే 
అనునిత్యం నా మార్గం 

పిలిచే రంగుల ముంగిళ్లు 
ఇరుకే తెలియని లోగిళ్లు 
వావి వరసల వంతెనగా 
మనసులు కలిపే సందళ్ళు 

ఈ చోటి నెమ్మది 
ఏ చోటా లేనిది 
ఈ పచ్చ గాలి నిండారా పీల్చే 
ప్రాణాలు నిడివి వెయ్యేళ్లు 

ఈ గూటి గువ్వ ఆహ్ ఏటి కాలువ 
ఈ మట్టి మనుషులే నావాళ్లు 
నా పల్లె 

అందినదేది పొందనిదేది 
అంతా మాయేలే 
ఉన్నది చాలనుకుంటాలే 

తెలతెల వారే కొత్త ఉగాది 
రోజు నాదేలే 
ప్రతి నిమిషంలో 
పండుగ చూస్తాలే 

బతుకెంత చిగురంత 
దించేస్తా బరువంతా 
చిరునవ్వే నా కథ 
శరదాలే సంపద 
ఏ లోటుపాటు రవ్వంత లేని 
మరో ప్రపంచం నాదంతా 

నా పేరు నేనే గుర్తుంచుకుని 
సామాన్య జీవిని నేనంటా 

నేను నా పల్లెటూరు 
ఇంతే నా స్వర్గం 
అందం ఆనందమే 
అనునిత్యం నా మార్గం 

యాదినుంచి వచ్చినావో 
తుమ్మెద తుమ్మెద 
ఎందుకోసం వచ్చినావే 
తుమ్మెద తుమ్మెద 

నిన్ను చూసి పువ్వు తేనె చిలికిందా 
పూల తేనె చూసి నీకు 
బుద్ధి కలిగిందా 

తేనె కన్నా తీపి గల్ల 
తాయిలాల మల్లేదో 
ఎతుక్కుంటే నీలో నీకే దొరికిందా 
తుమ్మెద తుమ్మెద 

నాలుగు దిక్కులే నా గది గోడలు 
నేనేచోటున్నా 
భూగోళమే నా ఇల్లనుకుంటాలే 

నన్నపవులే ఏ గిరి గీతాలు 
ఎల్లలు దాటైనా 
ప్రేమలు పంచే వెల్లువనవ్తాలే 

బదులిస్తే కలిసొస్తా 
బంధువనై బలమిస్తా 
పదుగురితో హాయిగా 
పయనిస్తా ప్రేమగా 

ఓ మాట మంచి చేతైన సాయం 
ఇవ్వలే నా రధచక్రాలు 

ఎందాకా పోని ఏమైనా కాని 
నావేలే అందరికీ కష్టాలు 

నేను నా పల్లెటూరు 
ఇంతే నా స్వర్గం 
అందం ఆనందమే 
అనునిత్యం నా మార్గం

👉 In Romanized - Nenu Na Palleturu Lyrics

Lyricist: రామజోగయ్య శాస్త్రి


About Nenu Na Palleturu (నేను నా పల్లెటూరు) Song

Credits:
Song Name: Nenu Na Palleturu
Movie: Godari Gattupaina
Singer: M.L.R. Karthikeyan
Music Director: Naga Vamshi
Lyricist: Ramajogayya Sastry
Featuring: Sumanth Prabhas, Nidhi Pradeep
Director: Subash Chandra
Music Label: Saregama Telugu